Header Banner

అమెరికాలో ఎన్నడూ లేనివిధంగా ఓ రియాలిటీ షో ఏర్పాటు! వలసదారులపై ఉక్కుపాదం!

  Sat May 17, 2025 15:38        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే అలాంటివారు అమెరికా పౌరసత్వం పొందడానికి ప్రభుత్వం ఓ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది (American citizenship). అందుకోసం ఎన్నడూ లేనివిధంగా ఓ రియాలిటీ షో ఏర్పాటుచేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పరిశీలనలో ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ(DHS) వెల్లడించింది. “పరిశీలన దశలో ఉన్న ఈ ప్రతిపాదన ఇంకా ఆమోదం కానీ, తిరస్కరణ కానీ పొందలేదు. ఇప్పటివరకు ఉన్న విధివిధానాలను దాటి వ్యవహరించాలనుకుంటున్నాం” అని ప్రజావ్యవహారాల విభాగం వెల్లడించింది. ఈ ప్రతిపాదిత షోలో పోటీదారులు అమెరికాపై తమ దేశభక్తిని చాటుకునేలా పోటీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ పోటీలో పాల్గొనే వలసదారులు గోల్డ్ రష్, కార్ అసెంబ్లీ వంటి టాస్క్ లు పూర్తి చేయాల్సి ఉంటుందని సమాచారం. "ఇది వలసదారులను ఉద్దేశించి నిర్వహించే హంగర్ గేమ్ కాదు” అని అధికారులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

ఎల్లిస్ ఐలాండ్లో ప్రారంభం కానున్న ఈ షోలో ఎపిసోడ్కు ఒకరిని చొప్పున ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. విజయం సాధించిన వారికి అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం వివిధ వర్గాలకు చెందిన వలసదారులకు తాత్కాలిక రక్షణ హోదా (TPS)ను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ షో గురించి వార్తలు వస్తున్నాయి. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అసాధారణ పరిస్థితుల వల్ల సురక్షితంగా స్వదేశానికి తిరిగి వెళ్లలేని విదేశీ పౌరుల కోసం టీపీఎస్ మంజూరుచేస్తుంటారు. ఇదిలాఉంటే.. ఈ వార్తల వేళ అత్యంత ప్రజాదరణ పొందిన స్క్విడ్డేమ్ సిరీస్ గుర్తుకువస్తోంది. జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్లైట్ గ్రీన్ప్లేట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే ఆటల పోటీలు నిర్వహిస్తారు. ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి. చివరగా వచ్చే ఆట పేరే 'స్క్విడ్ గేమ్'. ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకాదరణను సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో సీజన్ వచ్చేస్తోంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence